శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 14 నవంబరు 2017 (19:43 IST)

పవన్ భార్య అంటే ఫీలవ్వకుండా ఉండే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటా.. రేణు

పవన్ కళ్యాణ్‌తో దూరమైన తరువాత రేణుదేశాయ్ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది. పిల్లలున్న తాను ఒంటరిని కాదని ఎప్పుడూ చెబుతూ వచ్చిన రేణు దేశాయ్ ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ తను వివాహం చేసుకోబోయే వ్యక్తికి కొన్ని లక్షణాలు

పవన్ కళ్యాణ్‌తో దూరమైన తరువాత రేణుదేశాయ్ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది. పిల్లలున్న తాను ఒంటరిని కాదని ఎప్పుడూ చెబుతూ వచ్చిన రేణు దేశాయ్ ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ తను వివాహం చేసుకోబోయే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలంటోంది రేణు. తాను పవన్ కళ్యాణ్‌ మొదటి భార్యనని, తనకు పిల్లలున్నారని ఎవరైనా చెబితే తనను వివాహం చేసుకున్న వ్యక్తి ఫీలవ్వకుండా అవును.. అయితే ఏంటి నాకు ఆమె బాగా నచ్చింది అందుకే పెళ్ళి చేసుకున్నానని వారికి చెప్పాలి.
 
అలా చెప్పే వ్యక్తే నాకు కావాలి. నాకు దొరకాలి. అలాంటి వ్యక్తి కోసమే నేను ఎదురుచూస్తున్నా. చాలామందే వెంట పడుతున్నారు. కానీ ఎవ్వరూ నచ్చడం లేదు. నా పిల్లలను బాగా చూసుకోవాలి. రెండో పెళ్ళి జరుగుతుందో లేదో నాకు అర్థంకావడం లేదు. పెళ్ళి కాకుండానే నాకు ఏమైనా అవుతుందన్న భయం కూడా ఉంది అంటూ రేణు దేశాయ్ ఆవేశంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.