మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (15:56 IST)

రేణు దేశాయ్ కోసం మంచి అబ్బాయిని వెతుకుదాం.. ఉదయభాను (వీడియో)

నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంప్రదాయ దుస్తులతో కొత్త గెటప్ వేశారు. ఈ గెటప్‌లో అచ్చం పెళ్లి కూతురులా వున్నారు. ఆ గెటప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్

నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంప్రదాయ దుస్తులతో కొత్త గెటప్ వేశారు. ఈ గెటప్‌లో అచ్చం పెళ్లి కూతురులా వున్నారు. ఆ గెటప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు.

సహ న్యాయనిర్ణేత, యాంకర్, యాక్టర్ ఉదయభాను ఇప్పుడే సెట్స్ కొచ్చారని.. ఆమె గెటప్‌ను కూడా ప్రేక్షకులకు చూపెట్టారు. ఉదయభానును ప్రేక్షకులకు హాయ్ చెప్పమన్నారు. ఆ తర్వాత ఉదయ భాను రేణు దేశాయ్ అందాన్ని కొనియాడింది. పెళ్లి గెటప్ వేశామంది. 
 
అందుకు రేణూ దేశాయ్ స్పందిస్తూ.. పెళ్లి మాట తన నోట రాలేదని చెప్పారు. ఆ మాట వస్తే ఇక రకరకాల వార్తలు వస్తాయన్నారు. అయితే ఉదయ భాను మాత్రం రేణూ దేశాయ్ గెటప్ బాగుందని.. పెళ్లి కోసం త్వరలో మంచి అబ్బాయిని వెతుకుదామంది. ఇంతలో రేణు దేశాయ్ కలగజేసుకుని అది ఆమె కామెంటేనని క్లారిటీ ఇచ్చారు. కాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి అకీరా అనే అబ్బాయి, ఆద్యా అనే అమ్మాయి వున్న సంగతి తెలిసిందే.