ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (11:32 IST)

పవన్ ఫ్యాన్సుపై ఫైర్ రేణు దేశాయ్.. మీ అన్న కొడుకు కాదు.. వాడు నా బిడ్డ..

Pawan kalyan
Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి రేణుదేశాయ్‌ పవన్ ఫ్యాన్సుపై మండిపడుతున్నారు. "మా అన్న (పవన్ కల్యాణ్) కొడుకును అప్పుడప్పుడైనా సోషల్ మీడియాలో చూపించాలి" అని అడిగిన నెటిజన్‌పై ఫైర్ అయ్యారు. "మీ అన్న కొడుకు కాదు.. వాడు నా బిడ్డ" అంటూ జవాబిచ్చారు. మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలని హితవు పలికారు. శనివారం అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ వివాదం చోటుచేసుకుంది. 
 
అకీరానందన్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 19 ఏళ్లు వచ్చినా అకీరా నాకు ఇప్పటికీ పసిబిడ్డేనని అందులో రాసుకొచ్చారు. దీంతో అకీరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 
 
రేణుదేశాయ్ అభిమానులతో పాటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అకీరాకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెట్టారు. అయితే, ఓ అభిమాని పెట్టిన కామెంట్‌పై రేణుదేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ అని నాకు తెలుసు." అని రేణు దేశాయ్ చెప్పారు.