పవన్ ఫ్యాన్స్‌కు షాక్: గుండె సమస్యలతో బాధపడుతున్న రేణుదేశాయ్
సినీ తారలు అనారోగ్య బారిన పడటం సాధారణంగా మారిపోయింది. సమంత మయోసైటిస్, అనుష్క నవ్వుకు సంబంధించిన రుగ్మతతో బాధపడుతున్నారు. అలాగే నందమూరి హీరో గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు షాకిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది. పవర్ స్టార్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆమె గుండె, ఇతర సమస్యలతో బాధపడుతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తనను దగ్గరగా చూస్తున్న వారికి ఈ విషయం తెలుసునని రేణు దేశాయ్ స్వయంగా చెప్పుకొచ్చారు. వాటిని ఎదుర్కొనేందుకు కావాలసిన శక్తిని కూడగట్టుకుంటున్నానని వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ.. మందులను కొనసాగిస్తున్నానని తెలిపారు.
మంచి పోషకాహారం తీసుకుంటున్నట్లు రేణు దేశాయ్ చెప్పారు. తనలా ఎవరైనా సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకే ఈ విషయాన్ని పోస్ట్ చేస్తున్నానని తెలిపారు. త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదని సూచించారు.