వినోద్ ఖన్నా మృతి : 'బాహుబలి-2' ప్రీమియర్ షో రద్దు: కరణ్ జొహార్ వెల్లడి
బాలీవుడ్ సినీ దిగ్గజం వినోద్ ఖన్నా గురువారం కన్నమూశారు. దీంతో ఆయన మొతికి సంతాపసూచకంగా బాలీవుడ్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ఇందులోభాగంగా, ఈ రోజు రాత్రి ప్రదర్శింపతలపెట్టిన "బాహుబలి-2" ప్రీమియర్ షోను
బాలీవుడ్ సినీ దిగ్గజం వినోద్ ఖన్నా గురువారం కన్నమూశారు. దీంతో ఆయన మొతికి సంతాపసూచకంగా బాలీవుడ్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ఇందులోభాగంగా, ఈ రోజు రాత్రి ప్రదర్శింపతలపెట్టిన "బాహుబలి-2" ప్రీమియర్ షోను రద్దు చేస్తున్నట్లు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.
బాహుబలి టీమ్ అంతా వినోద్ ఖన్నా మృతి పట్ల సంతాపం తెలుపుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ బెనిఫిట్ షోను బాలీవుడ్‌లో మాత్రమే రద్దు చేస్తారా? లేదా అన్ని భాషల్లోనూ రద్దు చేస్తారా? అన్న విషయంపై స్పష్టత రాలేదు.
కాగా, క్యాన్సర్‌తో బాధపడుతూ కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన వినోద్ ఖన్నా గురువారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.