మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (13:17 IST)

విశ్వనాథ్ నాకు తండ్రి లాంటివారు.. చిరంజీవి ఆవేదన (video)

Chiranjeevi
Chiranjeevi
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ హఠాన్మరణం పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దర్శకనిర్మాత నివాసానికి వెళ్లి ఆయన ఆత్మకు అంతిమ నివాళులు అర్పించారు. దివంగత దర్శకుడికి నివాళులు అర్పిస్తూ కన్నీటి పర్యంతమవుతూ మెగాస్టార్ భావోద్వేగానికి లోనయ్యారు. 
 
మీడియా ఇంటరాక్షన్‌లో, చిరంజీవి దర్శకుడితో తనకున్న సన్నిహిత అనుబంధం గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సినిమా షూటింగుల సమయంలో విశ్వనాథ్ తనకు భోజనం పెట్టేవారని, దివంగత దర్శకుడిని తలచుకుని విచారం వ్యక్తం చేశారు.
 
విశ్వనాథ్ తనకు తండ్రి లాంటివారని "ఇంద్ర" సినిమా షూటింగ్ సమయంలో కాశీలో వారు సంగ్రహించిన ప్రత్యేక క్షణాన్ని పంచుకున్నారు. దివంగత దర్శకుడి కుటుంబానికి చిరంజీవి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమ నిజమైన ఐకాన్‌ను కోల్పోయినందుకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలిన కె విశ్వనాథ్ ఎన్నో క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.