మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:22 IST)

అమ్మవారికి నైవేద్యంగా విస్కీ సమర్పించిన దర్శకుడు ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. చర్చనీయాంశం కూడా. తాజాగా ఆయన అమ్మవారికి నైవేద్యంగా విస్కీని సమర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తద్వారా వార్తల్లో నిలిచారు 
 
తాను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నేత కొండా సురేఖ నివాసంలో ఉన్నానని, సమ్మక్క దేవికి మెక్‌డోవెల్‌ విస్కీ నైవేద్యంగా ఇస్తున్నానని చెప్పారు.
 
"కొండా మురళి, కొండా సురేఖ చూస్తుండగా కొండ నివాసంలోని సమ్మక్క దేవికి నేను మెక్‌డోవెల్ విస్కీని అందిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు. అతని పోస్ట్‌పై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.