ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (08:59 IST)

కరోనాతో మగాళ్లంతా చావాలి.. స్త్రీజాతికి నేనొక్కడే దిక్కు కావాలి : వర్మ

Sultana, Varma
కరోనా వంటి వైరస్‌తో మగాళ్లంతా చచ్చిపోవాలని అపుడు స్త్రీ జాతికి తాను ఒక్కడినే దిక్కుకావాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా, తాగండి, తినండి.. ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా కష్టపడేవారు పైకి రారని ఆయన విద్యార్థులకు సెలవిచ్చారు. 
 
గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశి, మేనక వంటి వారు ఉండకపోవచ్చన్నారు. అందువల్ల జీవితాన్ని ఇక్కడే ఎంజాయ్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఎవరికి నచ్చిన విధంగా వారు జీవించాలన్నారు. కష్టపడకుండా, ఉపాధ్యాయులు మాటలు వినకుండా ఇష్టానుసారంగా బతకాలని సూచించారు. 
 
కష్టపడిచదివేవారు వారు ఎపుడూ పైకిరారన్నారు. ఏదైనా కరోనా వంటి వైరస్ వచ్చి మగాళ్ళంతా చచ్చిపోవాలని, అపుడు ఈ స్త్రీజాతికి తాను ఒక్కడినే దిక్కు కావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి అని విద్యార్థులకు సూచించారు. 
 
మరోవైపు, విద్యార్థులకు మంచి మాటలు చెప్పాల్సిన వర్మ.. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటంపై అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. యూనివర్శిటీ విద్యార్థులకు చెప్పే మాటలు ఇవేనా అని ప్రశ్నించారు. ఈయన వ్యాఖ్యలపై యూనివర్శిటీ విద్యార్థులే కాదు ఇతర విద్యార్థులతో పాటు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.