1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (11:30 IST)

కొన్ని పెళ్ళిళ్ళకు వెళ్లిన వరుడు కావలెను యూనిట్

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్‌లోనూ మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అలరిస్తుండటం. ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తుండటంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. 
 
ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కొన్ని పెళ్ళిళ్ళకు ‘వరుడు కావలెను’ యూనిట్ హాజరైంది. అయితే ఎలాంటి ఆహ్వానం లేకుండా సరప్రైజ్ విజిట్‌గా నాగశౌర్య, రీతూ వర్మ హాజరు కావటంతో ఆ యా పెళ్ళి మండపాలలో సందడి నెలకొంది.