శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (10:40 IST)

ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న రోహిత్ శర్మ... ప్రపంచ రికార్డుకు చేరువలో..

rohit sharma
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఏకంగా ఆరు సిక్సర్లు బాదాడు. ఫలితంగా ఇప్పటివరకు మొత్తం 551 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నారు. తొలి స్థానంలో 553 సిక్సర్లతో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ రికార్డును అధికమించేందుకు మరో మూడు సిక్సర్ల దూరంలో రోహిత్ శర్మ ఉన్నాడు. 
 
బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి అవుటయ్యాడు. మొత్తం ఆరు సిక్సర్లతో స్టేడియంను హోరెత్తించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో 551 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. మరో మూడు సిక్సర్లు కొడితే గేల్ రికార్డును అధికమించవచ్చు. వన్డేల్లో ఒక మ్యాచ్‌లో ఐదుకు పైగా సిక్స్‌లు బాదడి రోహిత్ శర్మకు ఇది 17వ సారి కావడం గమనార్హం. టీమిండియా తరపున సచిన్ 8, గంగూలీ 7, సెహ్వాగ్ 6, ధోనీ 5 సార్లు చొప్పున ఈ ఫీట్‌ను సాధించారు.