యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రోటి కపడా రొమాన్స్
Harsha Narr - Sandeep Saroj - Tarun - Supraj Ranga
హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం రోటి కపడా రొమాన్స్. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు.
శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ పేరిట పబ్లిసిటి వీడియోను విడుదల చేశారు. ఈ ఫస్ట్‌డోస్ చూస్తుంటే.. ఇదొక వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తుంది. ఈ ఫస్టడోస్‌లో వున్న యూత్‌ఫుల్ మూమెంట్స్ , ఫ్రెండ్‌షిప్, రొమాన్స్ ఇవన్నీ చూస్తుంటే యూత్‌కు ఇది మంచి కిక్ ఇచ్చే సినిమాలా కనిపిస్తుందని అంటున్నారు టీజర్ చూసిన వాళ్లు. ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ నలుగురు స్నేహితుల కథ ఇది. వారి స్నేహం, ప్రేమ, వారి లైఫ్ జర్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువతరాన్ని అమితంగా ఆకట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా వున్నాయి. అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.తప్పకుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా వుంటుంది* అన్నారు.