శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (11:37 IST)

టాప్ లెస్.. టైట్ హగ్.. రాయ్‌లక్ష్మీ రొమాన్స్ మామూలుగా లేదుగా..!

హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. సినీ అవకాశాల కోసం బాగా ఒళ్లు తగ్గినా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేసినా.. ఆమెకు ఆఫర్లు రావట్లేదు. దీంతో రాయ్ లక్ష్మీ ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి కూడా ఎంటర్ అయిపోతోంది. 
 
ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు, నటులు వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రాయ్ లక్ష్మీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ పాయిజన్ 2. ఏప్రిల్ 30న ఈ వెబ్ సిరీస్‌ని టెలికాస్ట్ చేయబోతున్నారు. 
 
ఈ సందర్భంగా హీటెక్కించే ఓ పోస్టర్‌ని రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే రాయ్ లక్ష్మీ ఈ వెబ్ సిరీస్‌లో చాలా బోల్డ్‌గా రొమాన్స్‌తో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఈ పోస్టర్‌లో రాయ్ లక్ష్మీ, నటుడు అఫ్తాబ్ ఇద్దరూ టాప్‌లెస్‌గా టైట్ హగ్‌తో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా రాయ్ లక్ష్మీ కాంచన మాల టీవీ చిత్రంతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150లో రాయ్ లక్ష్మీ రత్తాలు అనే స్పెషల్ సాంగ్‌లో చిందేసిన సంగతి తెలిసిందే.