1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 మే 2023 (19:17 IST)

హీరో వెంకట్ చేతుల మీదుగా రుద్రాక్షపురం టీజర్ విడుదల

hero venkat and appaji, suresh, veerabau
hero venkat and appaji, suresh, veerabau
మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ  రేఖ  తారాగణంగా.. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ తాజాగా టీజర్‌‌ని విడుదల చేశారు. టాలెంటెడ్ యాక్టర్ వెంకట్ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 
టీజర్‌లో.. ‘ఏదో సాధించాలని వెళుతున్నారు.. అనుకోకుండా చావు ఎదురైంది. భయంతో పరుగులు తీస్తే అది వెంటపడింది. చస్తే సమాధికి, బతికితే ఇంటికి.. తిరగబడితే జయం నిశ్చయం అయింది. జయం నిశ్చయం’ అంటూ పవర్ ‌ఫుల్ వాయిస్ ఓవర్‌లో టీజర్ నడవగా.. ఆ వాయిస్‌కి అనుగుణంగా అదిరిపోయే యాక్షన్‌తో ఈ టీజర్‌ ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌కి కావాల్సిన కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉందనేలా టీజర్‌‌ని కట్ చేశారు.
 
ఈ టీజర్ విడుదల చేసిన అనంతరం హీరో వెంకట్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన మణి సాయితేజకు, పవన్ వర్మకు, డైరెక్టర్ ఆర్.కె.గాంధీగారికి, మీడియా సూపర్ హీరోస్ సురేష్ కొండేటి, వీరబాబు, అప్పాజీగార్లకి.. ఇంకా చిత్రయూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు. టీజర్ చూశాను. చాలా బాగుంది. మంచి యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ ఇదని అనిపించింది. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి విజయవంతం చేయండి. మరొక్కసారి నా బెస్ట్ విశెష్‌ని చిత్రయూనిట్‌కి తెలియజేస్తున్నానని అన్నారు.
 
చిత్ర దర్శకుడు ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ.. ‘‘మా ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించిన హీరో వెంకట్‌గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఆయన కూడా ఓ మెయిన్ రోల్ చేయాల్సి ఉంది. కానీ.. ఆయన బిజీగా ఉండటం కారణంగా కుదరలేదు. ఆయన చేయాల్సిన పాత్రని సురేష్ కొండేటిగారు చేశారు. ఇప్పుడు వెంకట్‌గారి చేతులు మీదుగా ఈ టీజర్ విడుదలవడం చాలా సంతోషంగా ఉంది. జూన్ 23న సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రమోషన్స్ కోసం సాంగ్స్, ట్రైలర్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ సినిమాని థియేటర్లలో చూసి.. ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.
 
చిత్ర హీరో సాయి మణితేజ మాట్లాడుతూ.. టీజర్ విడుదల చేసిన వెంకట్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో అనుకోకుండా నేను హీరోగా చేయడం జరిగింది. ఫస్ట్ లుక్‌ని ప్రకాశ్ రాజ్‌గారు విడుదల చేసిన తర్వాత.. హీరో ఇంకా ఫైనల్ కాలేదు. అప్పుడు నేను దర్శకుడు గాంధీగారికి కనిపించడంతో.. ఆయన ఈ సినిమాలో హీరో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. చాలా మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసిన దర్శకుడు గాంధీగారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. మరో నటుడు పవన్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
 
నిర్మాత కొండ్రాసి ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసిన వెంకట్‌గారికి ధన్యవాదాలు. ఆయనతో నాకు తెలియని బంధం ఉంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో నా భార్యతో కలిసి చూసిన మొట్టమొదటి చిత్రం ఆయన నటించిన చిత్రమే. అందుకే ఆయనలానే నా బిడ్డని హీరోని చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నా కుమారుడిని హీరోగా ఈ సినిమాతో పరిచయం చేయడం, చిత్ర టీజర్‌ని వెంకట్‌గారు విడుదల చేయడం.. దైవ సంకల్పంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం గాంధీగారు చాలా కష్టపడ్డారు. మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. నేను ఆల్రెడీ సినిమా చూశాను. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.