శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (18:29 IST)

పుష్ప నుంచి మూడో సింగిల్.. సామి సామి ప్రోమో విడుదల

Pushpa
ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్‌ల క్రేజీ కాంబినేష‌న్లో హ్యాట్రిక్ సినిమాగా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతుంది. ఈ సినిమా లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.
 
పార్ట్ వన్ పుష్ప… డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది. ఇక వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ స్ట్రాంగ్ క్రియేట్ చేస్తోంది పుష్ప మూవీ యూనిట్. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. 
 
ఇక తాజాగా మూడో సింగిల్ "సామి సామి" ప్రోమోను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రోమో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే దీని పూర్తి సాంగ్ ను అక్టోబర్ 28 వ తారీఖున ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని పుష్ప చిత్ర యూనిట్ ప్రకటించింది.