ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (13:45 IST)

సౌందర్య బయోపిక్.. సాయిపల్లవి తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

అందాల రాశి సౌందర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం, అభినయంతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది సౌందర్య. కానీ విమాన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో సినీ ప్రేక్షకులు షాకయ్యారు. ఈ నేపథ్యంలో సౌందర్య బయోపిక్ రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. దివంగత నటి సౌందర్య బయోపిక్‌ని రూపొందించడానికి ఓ మలయాళ సినీ నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. 
 
కర్ణాటకలో జన్మించిన సౌందర్య దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. దాదాపు అన్ని దక్షిణాది భాషల్లోని అగ్రనటులతో ఆమె నటించారు. ఇక 2004లో బీజేపీ పార్టీ ప్రచారం కోసం వెళ్లిన సమయంలో హెలీకాఫ్టర్‌ ప్రమాదంలో ఆమె మృతి చెందారు.
 
సౌందర్య పాత్రకు సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. సహజ నటిగా పేరు సంపాదించిన సాయి పల్లవి అయితే సౌందర్య పాత్రకి సరిగ్గా సరిపోతుందని నిర్మాత భావిస్తున్నారట.
sai pallavi


ఈ మేరకు నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఏరికోరి పాత్రలను ఎంచుకుంటున్న సాయి పల్లవి ఈ బయోపిక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.