శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:03 IST)

రావే ఊర్మిళా... అంటోన్న సాయిధరమ్ తేజ్

మెగా హీరో సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం చిత్ర‌ల‌హ‌రి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. అందమైన ప్రేమకథగా నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మూడవ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా .. ఏడు రంగులొక్కటై పరవశించే వేళలో నేలకే జారిన కొత్త రంగులా .. ప్రేమ వెన్నెలా .. రావే ఊర్మిళా .. " అంటూ ఈ పాట సాగుతోంది.
 
కథానాయకుడు పాడుకునే పాట ఇది. సాయితేజ్.. కల్యాణి ప్రియదర్శన్‌పై చిత్రీకరించిన ఈ పాట విన్న వెంట‌నే ఇట్టే న‌చ్చేస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, గీత ర‌చ‌యిత‌ శ్రీమణి సాహిత్యం  సుదర్శన్ అశోక్ ఆలాపన బాగుండ‌టంతో విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సాయితేజ్..స‌రైన స‌క్స‌స్ కోసం వెయిట్ చేస్తున్న త‌రుణంలో వ‌స్తున్న సినిమా ఇది. మ‌రి... అంచ‌నాల‌ను అందుకుని ఆశించిన విజ‌యం సాధిస్తాడేమో చూడాలి.