శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (19:11 IST)

మెగా ఈవెంట్‌కు నందమూరి స్పెషల్ గెస్ట్

సాధారణంగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల సినిమా ఫంక్షన్‌లకు ఎవరో ఒక మెగా హీరో అతిథిగా రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా మెగా హీరో సినిమా ఫంక్షన్‌కు నందమూరి హీరో అతిథిగా రాబోతున్నాడు. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ తాజాగా నటించిన చిత్రలహరి సినిమా ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు. 
 
చిత్రలహరి సినిమా ట్రైలర్, గ్లాస్ మేట్స్ పాట విడుదలైన తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అసలే హిట్లు లేక ఇబ్బందులు పడుతున్న ధరమ్ తేజకు ఈ పాజిటివ్ టాక్ బూస్ట్‌లా పని చేస్తోంది. 
 
ఇదే జోష్‌లో చిత్రలహరి సినిమా ఈవెంట్ కోసం ఎన్‌టీఆర్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్‌టీఆర్ ఈ ఈవెంట్‌కు వచ్చేందుకు సుముఖత చూపినట్లు సమాచారం. ఎన్‌టీఆర్ ఈ ఈవెంట్‌కు వస్తే చిత్రలహరి సినిమాకు మరింత బజ్ వచ్చే అవకాశం ఉంది.