గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జనవరి 2024 (18:25 IST)

పువ్వులంటే ఇష్టం.. కానీ నా శరీరానికి వీటి వల్ల ఎనర్జీ : హీరోయిన్ సమంత

samanta
పువ్వులంటే తనకు అమితమైన ఇష్టమని తన శరీరానికి వీటివల్ల ఎలర్జీ హీరోయిన్‌కు సమంత అన్నారు. నటనకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఓ అందమైన ఫొటోను షేర్‌ చేశారు. పువ్వుల బొకే అందుకుంటున్నట్లు ఉన్న చిత్రాన్ని పంచుకున్న సమంత.. వాటిని తాకాలంటే భయమేస్తోందని పేర్కొన్నారు.
 
'ఇలాంటి బొకేలు చూసినప్పుడు మిశ్రమ భావనలు కలుగుతాయి. ఎందుకంటే నేను పువ్వులను ఇష్టపడతాను. కానీ నా శరీరానికి వీటి వల్ల ఎలర్జీ వస్తుంది. గతంలో ఈ పువ్వుల కారణంగానే నేను ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లాల్సొచ్చింది. అందుకే వీటిని చూస్తే భయమేస్తుంది' అని రాశారు. ఇది వైరల్‌గా మారడంతో దీన్ని చూసిన వారంతా ఇందులో సమంత చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.
 
గతేడాది 'ఖుషి'తో అలరించిన సమంత త్వరలో 'సిటాడెల్‌' (ఇండియన్‌ వెర్షన్‌) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ మరో కీలక పాత్రధారి. రాజ్‌, డీకే దర్శకత్వం వహించారు. మరోవైపు, సమంత కొన్ని రోజుల క్రితం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. 'ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. 
 
కొత్త ప్రతిభను ప్రోత్సాహిస్తూ.. అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప2’లో ఆమె మరోసారి ఐటెమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.