బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రౌండప్ 2023
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (18:53 IST)

2023లో హీరోయిన్లు: హిట్ ప్లాప్‌లను చవిచూస్తూనే ఐటం గాళ్స్‌గా మారారు

Rashiika-mrunalini
Rashmika-mrunalini
ఈ ఏడాది హీరోయిన్లకు కొత్త అనుభవాన్ని సినిమా రంగం చూపించింది. హీరోయిన్‌గా వున్న వారు ఐంటం సాంగ్ లకు పరిమితం కావడం. మరలా హీరోయిన్లుగా మారడం కామన్ అయింది. 2023 ఏడాదిని పరిశీలిస్తే చాలామంది హీరోయిన్లు కథాబలం వున్న సినిమాలపై కాన్‌సన్‌ట్రేషన్ చేసినట్లు చెప్పవచ్చు. అనుష్క, కాజల్ అగర్వాల్, శ్రుతిహాసన్, కీర్తి సురేష్, సమంత, మృణాళినీఠాగూర్, తమన్నా, రష్మిక మందన్న, వరలక్మి శరత్ కుమార్, సంయుక్త మీనన్ వంటి వారు హిట్ ప్లాప్‌లను చవిచూశారు. తమకు వచ్చిన పాత్రలకు న్యాయం చేసే క్రమంలో హీరోయిన్‌కు ప్రాధాన్యత వుండేలా జాగ్రత్త పడడం జరగుతుంది. ఇక కొత్తగా వచ్చిన శ్రీలీల రాకెట్‌లా సినిమాలలో దూసుకుపోతూ హిట్, ఫ్లాప్‌లను చవిచూసింది. ఆమె కోసమే ఎక్స్‌ట్రాడినరీ మేన్ దర్శకుడు వంశీ షూటింగ్ కూడా వాయిదా వేసుకుని ఆమె చేత సినిమా చేయించాడు.
 
ఇదిలా వుండగా, మరికొందరి పరిస్థితి మరోలా వుంది. ఇంతకుముందు హీరోయిన్‌గా చేసిన వారు పరిస్థితులకు తలొగ్గి ఐటెం గాళ్‌గామారిపోతున్నారు. సినిమా చేయడం హీరోలకు ఏడాది పడుతున్నా హీరోయిన్లకు అలా లేదు. వచ్చిన అవకాశాలనువెంట వెంటనే చేసేకుంటున్నారు. దాంతో మూడు నాలుగు సినిమాలు చేస్తూ హీరోలకంటే ముందు వరుసలో వున్నారు. దానికి కారణం హీరోయిన్ పాత్రల పరిధి పరిమితం కావడమే. ఏది ఏమైనా వచ్చిన పాత్ర ఐటెం సాంగ్, లేక అడల్ట్ కంటెంట్ వున్న పాత్ర అనేదానికి భయపడకుండా చేసేస్తున్నారు. 
 
Pyal, samyouktha
Pyal, samyouktha
గతంలో ఆర్.ఎక్స్ .100 లో ఎక్స్ పోజ్ చేసిన పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమాలో కోరికలు జయించలేక అపరిమతమైన శ్రుంగారం చేసే పాత్రను పోషించింది. గతంలో అందరికీ భయపెట్టిన నందితా శ్వేత ఈ సినిమాలో మామూలు పాత్ర పోషించింది. హెబ్బా పటేల్ కూడా బి అండ్ డబ్ల్యు అనే సినిమాతో వచ్చినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఇలా ఈ ఏడాది హీరోయిన్లు తమ లక్క్ ను పరిక్షించుకున్నారు. 
 
Samantha
Samantha
ఈ ఏడాది నటి సమంత ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అంతకుముందు మొదలు పెట్టిన శాకుంతం విడుదలైంది. దర్శకుడు గుణశేఖర్ ఏదో చేయబోయే ఏదో చేసినట్లుగా ఈ సినిమా ఆయనకూ, సమంతకూ పెద్ద మైనస్ గా మారింది. శాకుంతల కథ పాఠ్యపుస్తకాల్లో చవివేసినా దాన్ని టెక్నికల్ గా కొత్తగా చేస్తూ చూస్తారని బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. వంటి సినిమాలు చూడలేదా? అంటూ అంచనాలు వేసిన గుణశేఖర్ ఈ సినిమా గుణపాఠం నేర్పింది. తెలిసిన కథ, ఆసక్తి లేని కథనం తో డిజాస్టర్ గా నిలిచింది.
 
ఇక ఆ తర్వాత విడుదలైన ఖుషి సినిమా సమంతకు బ్లాక్ బస్టర్ విజయం చేకూర్చలేకపోయినా అటు హీరో విజయదేవర కొండకూ పర్వాలేదు అనేలా ఈ సినిమా రిజల్ట్ వచ్చింది. 
 
shrutihasan
shrutihasan
శ్రుతి హాసన్ విషయానికి వస్తే ఈ ఏడాది చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలక్రిష్ణ వీర సింహా రెడ్డితో సక్సెస్ ను అందుకుంది. ఇలాంటి ఆమె షడెన్ గా హాయ్ నాన్న సినిమాలో ఐటెం సాంగ్ కు అంకితమై ఆశ్చర్యపరిచింది. గోవాలో మోడల్ గా, డాన్సర్ గా ఆమె నటించిన ఈ పాత్ర సినిమాకు పెద్దగాహెల్ప్ కాకపోయినా కథ వినూత్నంగా వుండడంతో ఈసినిమా సక్సెస్ సాధించింది. ఇలాంటి శ్రుతి డిసెంబర్ 22 న ప్రభాస్ సినిమా సలార్ లో నాయికగా కనిపించనుంది. ఇందులో మందు కొట్టే సీన్ లోనూ నటించింది. ఇది కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో అడవి శేష్ కి జోడీగా నటించనుంది. వచ్చే వారం షూటింగ్ లో పాల్గొననుంది.
 
Kajal-tamanna-charmi
Kajal-tamanna-charmi
ఇక తమన్నా విషయానికి  వస్తే, చిరంజీవితో ఫుల్ లెంగ్గ్ క్యారెక్టర్ కోసం చూస్తున్న ఆమెకు భోలా శంకర్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు సక్సెస్ చేారిపోయింది. ఆ తర్వాత తమిళ సినిమా జైలర్ లో రజనీకాంత్ తో ఐటెం సాంగ్ లో నటించింది. ’కావాలయ్యా.. నువ్వే కావాలయ్యా..’ అంటూ ఆమె చేసిన డాన్స్ లో సునీల్, రజనీకాంత్ లు నటించారు. ఈ సినిమా విజయవంతం అయింది.
 
కాజల్ అగర్వాల్ మాత్రం బాలక్రిష్ణ నటించిన భగవత్ కేసరిలో ఆయనకు జోడీగా నటించినా ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యలేకపోయింది. అయినా సినిమా హిట్ కావడంతో ఆమెకు విజయం వచ్చిందనే చెప్పాలి. లేటెస్ట్ గా సత్యబామ అనే సినిమాలో తను నటించబోతోంది.
 
Sree leela
Sree leela
శ్రీలీల గురించి చెప్పుకోవాలి. సడెన్ గా పెళ్లి సందడి సినిమాలో మెరిసిన ఈ యువ నటి ధమాకా సినిమాతో గత ఏడాది సక్సెస్ చవిచూసింది. బాలక్రిష్ణ కూతురుగా భగవత్ కేసరిలో నటించి సక్సెస్ తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన స్కంద సినిమా ఆమెకు అంతగా విజయం చేకూర్చలేకపోయింది. ఆది కేశవ సినిమా కూడా అంతంత మాత్రంగా నే ఆడింది. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రాడనరీమేన్ లో నటించినా ఆ సినిమా ఫెయిల్ అయింది. తాజాగా గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రాజు సినిమాలు చేస్తుంది. అవి వచ్చే ఏడాదికి రానున్నాయి.
 
సార్ సినిమాతో విజయాన్ని తెచ్చుకున్న తమిళ నటి సంయుక్త మీనన్ తెలుగులో విరూపాక్షతో సక్సెస్ సాధించింది. డిసెంబర్ 29 న విడుదలకాబోయే డెవిల్ సినిమా పాన్ ఇండియా సినిమాలో నటించింది.
 
రష్మిక మందన్నా విషయానికి వస్తే, పుష్ప సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ సినిమా యానిమల్ లో నటించింది. ఆ సినిమా విడుదలకు ముందు ఆమెపై కొన్ని గాసిప్స్ కూడా బయటకు వచ్చాయి. ఆమె ఫేస్ మార్ఫింగ్ చేసి గందరగోళం స్రుష్టించారు. యానిమల్ సినిమా విడుదలయ్యాక ఆమె నటించిన సన్నివేశాలు చూశాక అందరూ అవాక్కయ్యేలా వుంది. శ్రీ వల్లి వంటి అమాయకపు పాత్రను పోషించిన రష్మిక యానిమల్ లో శ్రుతి మించిన శ్రుంగారదేవతగా నటించదనే చెప్పాలి. ఇక పుష్ప 2 , రెయిన్ బో, ది గర్ల్ ప్రెండ్ సినిమాలు ఆమె ఖాతాలో విడుదలకావాల్సి వుంది.
 
Anuska shetty
Anuska shetty
అనుష్క గురించి చెప్పాలంటే, చాలా కాలం నటనకు దూరంగా వుండి, జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది. ఒకరకంగా లేడీ ఓరియెంటెడ్ పాత్ర అది. ముందు ముందు అటువంటి స్థాయిపాత్రలే చేస్తాననంటోంది. తాజాగా ఆమెతో ఓకొత్త సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ సన్నాహాలు చేస్తోంది.
 
ఇకవీరితోపాటు కన్నడ నటి ఖుషి రవి చేసిన పిండం సినిమా కూడా ఆమెకు సస్సెస్ సాధించి పెట్టింది. ఇలా కొత్త నటీమణులు ఈ ఏడాది రావడం విజయం చవిచూడడం జరిగింది.