శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (22:28 IST)

అనుష్క శర్మ బేబీ బంప్ ఫోటో వైరల్

anushka - kohli
బాలీవుడ్ నటి, స్టార్ క్రికెటర్ భార్య అనుష్క శర్మ మళ్లీ తల్లి కాబోతోంది. ప్రస్తుతం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా జట్టుకు దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు గత వారం తమ 6వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. 
 
ఇదిలా ఉంటే విరుష్క జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో విరాట్ అనుష్కతో తెల్లటి కుర్తాలో కనిపిస్తున్నాడు. గోల్డెన్ కలర్ చీరలో అనుష్క కనిపించింది. విరాట్ తన భార్య భుజంపై చేయి వేశాడు. అనుష్క ఇందులో బేబీ బంప్‌తో కనిపిస్తోంది. 
 
అందుకే ఈ ఫోటోతో అనుష్క శర్మ మళ్లీ తల్లి కాబోతోందనే వార్త సర్వత్రా వైరల్‌గా మారింది. అయితే ఇది ఓల్డ్ ఫోటో అని కింగ్ కోహ్లీ చెప్పాడు. అయితే అనుష్క మళ్లీ గర్భవతి అనే వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. మరి ఈ వార్త నిజమేనా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.