సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (11:51 IST)

విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన భారతీయ యువ క్రికెటర్.. ఎవరు?

surya - ishan
ప్రపంచ క్రికెట్‌‍లో పరుగుల కింగ్‌గా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవలే వన్డేల్లో తన 50వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే, పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి క్రికెటర్ రికార్డును భారత క్రికెట్ జట్టుకు చెందిన ఓ యుంగ్ క్రికెటర్ సమం చేశాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. టీ20 ఫార్మెట్‌లో 56 ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగులు మైలురాయిని అధికమించాడు. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్... 56 పరుగులు చేసి ఈ రికార్డును అధికమించాడు. 
 
ఈ మ్యాచ్‌లో 155కు పైగా స్ట్రైక్ రేట్‌తో వేగంగా ఆడిన సూర్య కుమార్ 36 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20 ఫార్మెట్‌లో వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ 56 ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగులు చేయగా, ఇపుడు దాన్ని సూర్య కుమార్ యాదవ్ అధికమించాడు. ఈ సందర్భంగా సూర్య కుమార్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అభినందనలు తెలుపుతూ ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. 
 
కాగా, ఈ ఫార్మెట్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. 58 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని సాధించాడు. రోహిత్ శర్మ 77 ఇన్నింగ్స్‌లలో రెండు వేల పరుగులు పూర్తి చేశాడు. అంతర్జాతయ స్థాయిలో పాకిస్థాన్ బ్యాటర్లు బాబర్ అజం, మహ్మద్ రిజ్వాన్‌లు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ 52 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డును పూర్తి చేశారు.