గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (11:39 IST)

మే లేదా జూన్‌లో వస్తోన్న సమంత సిటాడెల్

Samantha Prabhu with Citadel team
ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత, సమంత రాబోయే బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాలుగైదు నెలల క్రితమే ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌ను సమంత పూర్తి చేసింది. అయితే ఇప్పటి వరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు.
 
తాజాగా, సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదల తేదీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సిటాడెల్ వెబ్‌సిరీస్ మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. 
 
ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. మార్చి నుంచి సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్‌లో సమంత పాల్గొననున్న సంగతి తెలిసిందే. సిటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంతతో పాటు వరుణ్ ధావన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫ్యామిలీ మేన్ ఫేమ్ రాజ్, డీకే సిటాడెల్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సిటాడెల్ సిరీస్‌లో సమంత గూఢచారి పాత్రలో కనిపించబోతోంది. సమంత యాక్షన్ సన్నివేశాల్లో కనిపించనుంది.
 
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించనుంది. ఈ ఏడాది సమంత టాలీవుడ్‌లో ఖుషీలో కనిపించింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.