బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (18:57 IST)

"ఓ మై లవ్" అంటూ సమంత పోస్టు.. ఫోటోలు వైరల్

Samantha_Tamannah
Samantha_Tamannah
సమంత- వరుణ్ ధావన్ నటించిన యాక్షన్-థ్రిల్లర్ వెబ్ సిరీస్ "సిటాడెల్". రాజ్ అండ్ డికె ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి సమంత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె ముంబైలో ఉంటున్న తన స్నేహితురాలు నటి తమన్నాను కలిశారు. 
 
ఈ సందర్భంగా విజయ్ వర్మ ఫోటోలు తీస్తున్నప్పుడు తమన్నా, సమంత ఫోజులిచ్చారు. వీటిని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో "ఓ మై లవ్" అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
 రాజ్, డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి  సిటాడెల్: హనీ-బన్నీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కెకె మీనన్, సిమ్రాన్, సోహమ్ మంజుదార్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. 
 
1900ల నేపథ్యంలో సాగే ఈ సిరీస్.. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయని అంటున్నారు. ఈ సిరీస్ కోసం సమంత మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. మరోవైపు ‘ఒదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌గా రూపొందుతున్న "ఒదెల 2"లో తమన్నా కథానాయికగా నటిస్తోంది. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి.మధు నిర్మిస్తున్నారు. హెబ్బాపటేల్, వశిష్ఠ ఎన్.సింహా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.