ఆదివారం, 16 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మార్చి 2025 (15:09 IST)

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

samantha
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంతకు తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. అది ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ పోస్టుకు జత చేసిన ఫోటోను చూసిన ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై సమంతకు పడుకుని ఉంటే ఆమె చేతికి సెలైన్ ఎక్కిస్తుండగా, ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో సమంతకు మళ్లీ ఏమైంది, ఆమె ఆరోగ్యం ఇపుడు ఎలా ఉందని అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. సమంత కొంతకాలంగా, మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెల్సిందే. 
 
అనారోగ్యం నుంచి కోలుకున్న "సిటాడెల్ : హనీ బన్నీ" సిరీస్‌తో సమంత అభిమానుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ సినిమాల్లో నటిస్తున్న సమంత... మా ఇంటి బంగారం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. అందులో కీలక పాత్రలో నటిస్తుంది. "ట్రాలా"లో మూవింగ్ పిక్చర్స్ పేరుతో తొలి ప్రాజెక్టు శుభం షూటింగ్‌ను ప్రారంభించంది. అయితే, తాజాగా సమంత ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.