బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (20:36 IST)

సిటాడెల్ యాక్షన్ సీన్స్ కోసం వెయిటింగ్.. సమంత

Samantha
త్వరలో రానున్న "సిటాడెల్: హనీ బన్నీ", "ది ఫ్యామిలీ మ్యాన్" సిరీస్‌లలో యాక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని నటి సమంత రూత్ ప్రభు వెల్లడించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’లో రాజి పాత్రలో సమంత చేసిన యాక్షన్ సీక్వెన్సులు ఆమెకు చాలా ప్రశంసలను సంపాదించి పెట్టాయి. ఆమె ప్రదర్శించిన విన్యాసాలపై మాట్లాడుతూ.. వరుణ్ ధావన్ నటించిన రాబోయే సిరీస్ కోసం కఠినమైన శిక్షణ, ప్రిపరేషన్ గురించి నటి వెల్లడించింది.
 
సమంత ఇంకా మాట్లాడుతూ "రాజీ క్యారెక్టర్‌కి ది ఫ్యామిలీ మేన్‌కి నేను చేసిన యాక్షన్‌కి ఇది చాలా భిన్నంగా ఉంటుంది. 'సిటాడెల్'లో యాక్షన్ గురించి నేను చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను. ఖచ్చితంగా ఇది నేను రాజి నుండి పొందాను. ఈ సిరీస్‌లోని కొన్ని యాక్షన్ బిట్‌లు తెరపై చూడటానికి నేను నిజంగా ఎదురుచూస్తున్నాను" అని సమంత వెల్లడించింది.