బిచ్చగాడి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగీత..!

Last Updated: శనివారం, 16 మార్చి 2019 (13:23 IST)
ఖడ్గం హీరోయిన్.. సంగీత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. వెండితెరపై కనిపించాలనే ఆశతో పల్లె నుంచి పట్నానికి వచ్చి.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగే అమాయకపు యువతిగా ఖడ్గం సినిమాలో నటించిన సంగీత.. సంగీత దర్శకుడు క్రిష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా తమిళరసన్ అనే చిత్రం ద్వారా సంగీత రీ ఎంట్రీ ఇవ్వనుంది. 
 
విజయ్ ఆంటోని, రమ్య నంబిసన్ నాయకా నాయికలుగా నటిస్తోన్న తమళరసన్ సినిమాలో సంగీత కీలక పాత్రలో కనిపించనుంది. పెళ్లికి తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయని.. అయితే అవి అంతగా నచ్చకపోవడంతో పక్కనబెట్టేశానని సంగీత వెల్లడించింది. 
 
ఈ చిత్రంలో తన కోసం అనుకున్న పాత్రకి మంచి గుర్తింపు వస్తుందని.. ఈ చిత్రంలో తనది కీలక పాత్ర అని సంగీత చెప్పుకొచ్చింది. కొత్తగా వున్న కారణంగా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని సంగీత తెలిపింది.దీనిపై మరింత చదవండి :