సంక్రాంతి వచ్చిందంటే ప్రజల జేబులకు చిల్లు - దీనికి కంట్రోల్ లేదా?
సంక్రాంతి అంటేనే కొత్త సినిమాలు, ప్రయాణాలు ప్రజలకు సర్వసాధారణం. ఊరెళ్ళాలంటే బస్సులు, ట్రయిన్ లలో తమ సంతోషాన్ని వెతుక్కొనేందుకు వెళుతుంటారు. కుటుంబంతో హాయిగా గడిపేందుకు సిద్ధమవుతారు. ప్రజల అవసరాలను కనిపెట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా ఏర్పాట్లు చేసి టికెట్ కు డబుల్ రేటు పెట్టి మరీ గుంజేవారు. ఒకరకంగా చెప్పాలంటే తెలివైన దోపిడీ చేసేవారు. ఇంకోపక్క సినిమా థియేటర్లలో టికెట్ రేటు కూడా అలాగే మారింది. థియేటర్లో 150 టికెట్ వుంటే దానికి మరింత జోడించి రేట్లు పెంచేశారు. ఇలా పెంచమని ప్రజలేమీ అడగరు. కానీ కొద్దిరోజుల్లోనే అటు నిర్మాతగానీ, ఇటు ప్రభుత్వాలు కానీ కోట్ల రూపాయలు ప్రజల జేబుల్లోంచి లాగేసుకుంటున్నారని విశ్లేషకులు తెయజేస్తున్నారు.
ప్రజలు కూడా లోలోపల తిట్టుకోవడం మినహా చేసేదేమిలేకుండా పోయింది. తాజాగా తెలంగాణలో ఈ పండగను దృష్టిలో ఉంచుకొని సింగిల్ స్క్రీన్‌లో అయితే రూ.250, అదే మల్టీప్లెక్స్ లో అయితే రూ.400 వరకూ టికెట్ రేట్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత కుటుంబంతో వస్తే రెండు వేలు వెచ్చించాలి. తినుబండారాలు, పార్కింగ్ ఫీజులు మామూలుగా వుండవు. అందుకే కుటుంబంతో మధ్య తరగతి సినిమా చూడాలంటే భారమే.
ఇక బెనిఫిట్ షోలు సరే సరే. గుంటూరు కారం సినిమా టికెట్ దాదాపుగా రూ.1500 నుంచి రూ.2 వేలకు పలికే ఛాన్సుంది. పండక్కి… ప్రేక్షకులు ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టుకోక తప్పేట్టు లేదు. తొలి వారం అంతా ఇదే స్థాయిలో రేట్లు ఉంటాయి కాబట్టి, ఓ వారం ఆగాక సినిమాకి వెళ్దామనుకొన్నవాళ్లే ఎక్కువ ఉండొచ్చు. ఎలాగో ఓటీటీలో వచ్చేదాకా ఆగవచ్చు అని మరికొందరు అనుకోవచ్చు. కానీ సొంత ఊరు వెళ్ళేందుకు మాత్రం ఆలోచించే ఛాన్స్ లేదు. తప్పకుండా పెరిగిన టికెట్ కొని వెళ్ళాల్సిందే. మరి ఇలాంటివి కంట్రోల్ చేసే వ్యవస్థ ఉంటె బ్యాగును అని అని ప్రజలు భావిస్తున్నారు.