Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిలేరు నీకెవ్వరు సెన్సార్ టాక్ ఏంటి..?

Written By శ్రీ
Updated: శుక్రవారం, 3 జనవరి 2020 (15:16 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. 
 
ఈ సినిమాని చూసిన సెన్సార్ టీమ్ మెంబర్స్ చిత్ర యూనిట్‌ని ఎంతగానో అభినందించారట. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి ముందుగానే అభినందనలు తెలియచేసారట. 
 
జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించి సంక్రాంతి కానుక‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్నారు.

అన్నీ చూడండి

మమతా బెనర్జీ కారుపై దాడి - వీడియో వైరల్

ఫిట్నెస్ సీక్రెట్‌ను వెల్లడించిన రాహుల్ గాంధీ

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ ప్రకటనలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నకిలీ గుర్తింపు కార్డుతో 25 వివాహాలు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు

ఆరిజోనాలో ప్రియురాలి హత్య : జర్మనీలో ప్రియుడి అరెస్టు

అన్నీ చూడండి

ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు

ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్: హైదరాబాద్‌లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ

Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?

సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?

గుజరాత్‌లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత

తర్వాతి కథనం
Show comments