శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (16:40 IST)

''సర్కార్'' సరికొత్త రికార్డ్..

''సర్కార్'' సినిమా బుల్లితెరపై రికార్డు సృష్టించింది. మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన సినిమా సర్కార్ బ్లాక్ బస్టర్ కాకపోయినా.. విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలోకి ఈ సినిమా చేరిపోయింది. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా బుల్లితెరపై మాత్రం పండగ చేసింది.
 
రిపబ్లిక్ డే రోజున బుల్లితెరపై ప్రసారమైన విజయ్ సర్కార్ సినిమా.. 16.9 మిలియన్ల వ్యూవర్ షిప్‌ను రాబట్టింది. ఇంతవరకూ దక్షిణాదిలో అత్యధిక వ్యూవర్ షిప్‌ను పొందిన మూడవ చిత్రంగా నిలిచింది. తొలి రెండు స్థానాల్లో ''పిచైక్కారన్" (బిచ్చగాడు) "బాహుబలి'' కొనసాగుతున్నాయి.