సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (18:41 IST)

మామతో ఎఫైర్... ప్రియుడితో రొమాన్స్ నిజమే... చంపుతాడనుకోలేదు : శిఖా చౌదరి

తన మామ ఎన్నారై జయరామ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉన్నమాట వాస్తవమేనని ఆయన మేనకోడలు శిఖా చౌదరి సంచలన విషయాన్ని వెల్లడించింది. అదేసమయంలో రాకేష్ చౌదరి తన ప్రియుడని చెప్పింది. అయితే, తన మామను రాకేష్ చౌదరి చంపుతాడని తాను ఊహించలేదని పోలీసుల విచారణలో శిఖా చౌదరి సంచలన విషయాలను వెల్లడించింది. 
 
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్నారై జయరామ్‌ ఇటీవల హత్య కావింపబడ్డారు. ఆయన్ను పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరిని, ప్రియుడు రాకేష్ చౌదరి, సౌదరి మనీషా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
ఈ విచారణలో భాగంగా శిఖా చౌదరి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిగురుపాటి జయరామ్‌తో తనకు చాన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉన్న మాట నిజమేనని చెప్పింది. అలాగే, రాకేష్ చౌదరి తన ప్రియుడని తెలిపింది. అయితే, రాకేష్ రెడ్డితో తనకు ఓ విల్లా విషయంలో గొడవ జరిగిందని, అప్పటి నుంచి కాస్త దూరంగా ఉంచినట్టు చెప్పారు. ఈ క్రమంలో తన మామ జయరామ్‌ను రాకేష్ చౌదరి చంపుతాడని ఊహించలేదని తెలిపింది. పైగా, చెక్ పవర్ మొత్తం మామ జయరామ్ భార్య పద్మజ పేరుతో ఉందని శిఖా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించింది. 
 
మరోవైపు, ఈ కేసులో రాకేష్ చౌదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వాంగ్మూలాన్ని సేకరించారు. అతనే జయరామ్‌ను హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో ఈ హత్య కేసులోని చిక్కుముడలు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. పైగా, ఈ హత్యకు సూత్రధారి, పాత్రధారి మేనకోడలు శిఖా చౌదరేనని పోలీసులు స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఆమె కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.