గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (21:52 IST)

సర్కారు వారి పాట 'మా మా మాస్ సెలబ్రేషన్స్'

Mahesh Babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో మే 12వ తేదీన థియేటర్లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను తెచ్చుకుంది. 
 
అలా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్న సర్కారు వారి పాట సినిమా రెండు రోజులు బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 58.21 కోట్ల షేర్ కలెక్షన్లను, 90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి ఫుల్ స్పీడ్‌లో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. 
 
తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. సమ్మర్ సన్సేషనల్ బ్లాక్ బాస్టర్ 'మా మా మాస్ సెలబ్రేషన్స్'  మే 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్ పిన్నమనేని పోలి క్లినిక్ విజయవాడలో 'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్‌ను జరపనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసి అఫీషియల్ అన్సౌన్స్‌మెంట్ చేసింది.