సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది
zebra poster
తాజాగా మేకర్స్ జీబ్రా గ్లింప్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 30న జీబ్రా గ్లింప్స్ రిలీజ్ కానుంది. సత్య దేవ్, డాలీ ధనంజయ ను డైనమిక్ గా ప్రజెంట్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది.
ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.
జీబ్రా దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు.
