బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (13:57 IST)

సావిత్రి కుమార్తె చాముండేశ్వరి, చిరంజీవి సతీమణి సురేఖ చిట్ చాట్

Chamundeshwari -  Surekha
Chamundeshwari - Surekha
అలనాటి సావిత్రి గురించి మహా నటి సినిమా వచ్చింది. బాగా తీశారు. కానీ ఇంకా తెలియాల్సింది చాలా వుందని సావిత్రి కుమార్తె చాముండేశ్వరి అన్నారు. అందుకే సావిత్రి క్లాసిక్స్ బుక్ రాశాననీ, దీనిని కొడుకులాంటి మెగాస్టార్ చిరంజీవి చేత ఆవిష్కరించాలని అనుకొని ఇంటిలోనే మీడియాతో కలిపి రిలీజ్ చేద్దామని చెబితే, చిరంజీవి గారు ఎన్ కన్వెన్షన్ అనే పెద్ద హాల్లో చేయించారని చాముండేశ్వరి అన్నారు. 
 
chiru family
chiru family
మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో చిరంజీవి సతీమణి సురేఖ, చాముండేశ్వరిని పలు సంగతలు అడిగి తెలుసుకున్నారు. ఇరువురూ చిన్ననాటి సంగతులు చెప్పడం విశేషం.
 
చాముండేశ్వరి: మా ఇంటిని చిన్న జూ లా అమ్మ వుంచేది. పక్షులు, చేపలు, కుందేలు, కుక్కలు, పిల్లులు పెంచేది. నాకు పాములంటే ఇష్టం. చిన్నప్పుడు పాములు ఆడించేవాడు వచ్చేవాడు. ఆ ఆటలో పాముతో అతను ఆడించడం కొత్తగా అనిపించేది. పామును ముట్టుకున్నారు.  అందుకే వారం వారం అతను వచ్చేవాడు. ఇక పులిపిల్లలంటే కూడా ఇష్టం. కొడైకెనాల్ వెళ్ళినపపుడు అక్కడ రాజుగారి దగ్గర పులిపిల్లలు వుంటే ఇంటికి తెచ్చాను. ఆ తర్వాత నాన్న చూసి వాటిని తిరిగి పంపిచేలా చేశారు. ఎదుకంటే అవి పెద్దయితే నీ మాట వినవు అనేవారు.
 
ఇక దుస్లులు విషయంలో కూడా అమ్మ రూల్స్ పెట్టేది. టైట్ దుస్తులు వద్దనేది. అంటూ పలు విషయలు చెప్పారు.
 
సురేఖ మాట్లాడుతూ, మా నాన్నగారు కూడా దుస్తులు విషయంలో ఆంక్షలు పెట్టేవారు. మోడ్రన్ గా వుండాలని కోరిక వుండేది. కానీ ఆయన ఒప్పుకునేవారు కాదు. కొద్దికాలానికి ఆయన చెప్పింది కరెక్టే అనిపించేది అంటూ వివరించారు.