శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (12:53 IST)

నటి ఇచ్చిన పార్టీకి చెమ్చా గ్యాంగ్‌ వెళ్లింది.. వినోద్ ఖన్నా అంత్యక్రియలకు వచ్చే తీరిక లేదు: రిషికపూర్

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈయన మృతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సంతాపం తెలిపింది. అయితే, వినోద్ ఖన్నా చనిపోతే బ

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈయన మృతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సంతాపం తెలిపింది. అయితే, వినోద్ ఖన్నా చనిపోతే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వర్ధమాన నటుడు రాలేదు. దీనిపై మరో సీనియర్ నటుడు రిషి కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.
 
‘ఈ తరానికి చెందిన ఒక్క నటుడు కూడా వినోద్‌ ఖన్నా అంత్యక్రియలకు హాజరుకాకపోవడం అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఆయనతో కలిసి నటించినవారు కూడా ఆయన అంత్యక్రియలకు రాకపోవడం దారుణమని ఆయన తెలిపారు. ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన సినీ నటులకు హితవు పలికారు. భవిష్యత్‌లో తాను మరణించినా, తన శవాన్ని మోస్తారన్న గ్యారెంటీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరం సోకాల్డ్ స్టార్స్‌‌పై తనకు చాలా కోపం వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ మధ్య తాజాగా హాలీవుడ్‌‌కి వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి ఈ తరం చెమ్చా గ్యాంగ్‌ మొత్తం వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. వినోద్ ఖన్నా అంత్యక్రియలకు మాత్రం హాజరయ్యేందుకు వారికి తీరిక లేకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు. కాగా, ఈ అంత్యక్రియలకు బచ్చన్ ఫ్యామిలీతో పాటు... రణదీర్‌ కపూర్‌, జాకీష్రాఫ్‌, అర్జున్ రాంపాల్‌, కబీర్‌ బేడి తదితరులు హాజరయ్యారు.