సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (16:23 IST)

హీరోగా మారనున్న షణ్ముక్ జశ్వంత్.. బిగ్ హౌస్ నుంచి రాకముందే?

యూట్యూబ్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అ‍క్కర్లేని పేరు షణ్ముఖ్‌ జశ్వంత్‌. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్‌ మామూలుగా ఉండవు. 
 
తాజాగా బిగ్ బాస్ ఎంట్రీతో  'బిగ్‌బాస్‌ బ్రహ్మ'గా పేరు సంపాదించుకున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అతను పక్కా టాప్‌-2లో తప్పకుండా అతను ఉంటాడని జోస్యాలు చెబుతున్నారు.
 
ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు రాకముందే.. షణ్ముఖ్‌ బంపరాఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా ఓ సినిమా రాబోతుందట. 
 
బిగ్ బాస్ 5 తెలుగు తర్వాత ఈయన ఫాలోయింగ్ మరింత పెరిగిపోవడంతో దర్శక, నిర్మాతలు షన్నూతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారట. త్వరలోనే షణ్ముఖ్‌ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం.