గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (14:59 IST)

'మ‌హాస‌ముద్రం'‌లో శ‌ర్వానంద్ ఫ‌స్ట్ లుక్‌

Sharwanand, Mahasamudram
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌లకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.
 
మార్చి 6 శ‌ర్వానంద్ బర్త్‌డే. ఈ సంద‌ర్భంగా 'మ‌హాస‌ముద్రం'లో ఆయ‌న ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ఇప్ప‌టిదాకా మ‌నం చూడ‌ని త‌ర‌హా శ‌ర్వానంద్ క‌నిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్‌లో స‌ముద్రం, బోట్లు క‌నిపిస్తుండ‌గా, బోటుకుంటే ఫ్యాన్ రాడ్‌ను ప‌ట్టుకొని నిల్చొని ఎవ‌రిమీదో యుద్ధం చేస్తున్న‌ట్లు ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో ఉన్నారు శ‌ర్వా. ఆయ‌న ఒంటి మీద‌, బ‌ట్ట‌ల మీద ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపిస్తున్నాయి.
 
ఈ పోస్ట‌ర్‌తో శ‌ర్వా ఎలాంటి క్యారెక్ట‌ర్ చేస్తున్నారో డైరెక్ట‌ర్ అజయ్ భూప‌తి హింట్ ఇస్తున్నారు. ఈ పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఆయ‌న‌, "From our Tale of #ImmeasurableLove.. Unveiling the Fierce First Look of @ImSharwanand from #MahaSamudram #HBDSharwanand" అంటూ ట్వీట్ చేశారు.
 
ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది. ఇంటెన్స్ ల‌వ్ యాక్ష‌న్ డ్రామాగా ఇది రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ప్ర‌వీణ్ కె.ఎల్‌. ఎడిట‌ర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.