సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2020 (16:08 IST)

శ్రీవారి సేవలో శర్వానంద్ - రష్మిక మందన్నా (Video)

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నాలు ఆదివారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు.. మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వీరంతా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
 
కాగా, శర్వానంద్ - రష్మిక మందన్నా జంటగా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల దర్శకత్వం వహిస్తుంటే సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మూవీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. 
 
అయితే లాంచింగ్‌కు ముందు ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామి వారిని ద‌ర్శించుకోగా, అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలు చిత్ర యూనిట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.