శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:42 IST)

అఖిల్‌తో రష్మిక రొమాన్స్.. కెమిస్ట్రీ ఓకే కానీ.. స్టోరీ లైన్..?

Akhil_Rashmika
టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున కుమారుడు చైతూ హీరోగా రాణిస్తూ.. అగ్ర హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ్ మరో కుమారుడు అఖిల్ అక్కినేని సినిమాలపై పూర్తి దృష్టి పెట్టాడు. హిట్ కోసం ఆరాటపడుతున్నాడు.

ఇందుకోసం మంచి కథలను వింటున్నాడు. చైతూ మంచి స్టోరీలైన్ సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్న తరుణంలో.. అఖిల్ కూడా మంచి హిట్ సినిమాను ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డితో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి అద్భుతమైన స్టోరీని అఖిల్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారథ్యంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితం కానుంది.

ఈ చిత్రంలో అఖిల్ కొత్త గెటప్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్నట్లు సమాచారం. రష్మిక-అఖిల్ కెమిస్ట్రీ బాగుంటుందని.. సురేందర్ రెడ్డి స్టోరీ లైన్ బాగా కుదిరితే సినిమా హిట్ కొట్టడం ఖాయమని అప్పుడే సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.