బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 24 సెప్టెంబరు 2020 (19:51 IST)

హైదరాబాద్ ఆసుపత్రిలో వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి, పరామర్శించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి షెడ్యూల్ చివరి నిమిషంలో మార్పు జరిగింది. తిరుమలలో పలు కార్యక్రమాలు ముగించుకున్న తరువాత నేరుగా రేణుగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరాల్సిన జగన్ తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్‌‌కు వచ్చారు.
 
ప్రత్యేక విమానంలో రేణిగుంట నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మామ గంగిరెడ్డిని పరామర్శించారు.
 
జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి అనారోగ్యంతో కొంతకాలంగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆసుపత్రికి వెళ్లి గంగిరెడ్డిను పరామర్శించారు.