శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (16:28 IST)

'మ‌హాస‌ముద్రం'లో చుంచుమామ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు

Jagapati babu, chuchumama
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానున్న‌ది. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.
 
ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. గురువారం, ఫిబ్ర‌వ‌రి 12 ఆయ‌న బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో జ‌గ‌ప‌తిబాబు ర‌గ్డ్ లుక్స్‌తో, భిన్న‌మైన అవ‌తారంలో క‌నిపిస్తున్నారు. లోప‌ల వ‌ల‌లాగా క‌నిపించే క‌ల‌ర్ బ‌నియ‌న్‌, ఒక గుండీ త‌ప్ప మిగ‌తా గుండీల‌న్నీ విప్పేసి, పైకి లాక్కున్న‌ట్లున్న చొక్కా, జీన్స్ ప్యాంట్ ధ‌రించిన ఆయ‌న తీక్ష‌ణంగా చూస్తున్నారు.
 
ప్ర‌స్తుతం 'మ‌హాస‌ముద్రం' షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది. ఇంటెన్స్ ల‌వ్ యాక్ష‌న్ డ్రామాగా ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ప్ర‌వీణ్ కె.ఎల్‌. ఎడిట‌ర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.
 
సాంకేతిక బృందం: ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి; నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రిక‌పాటి; స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర, సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కొల్లా అవినాష్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌.
యాక్ష‌న్‌: వెంక‌ట్‌.