సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (16:19 IST)

డాన్స్ చేసిన జ‌గ‌ప‌తిబాబు

Jagapati babu, Durgarao dance
జ‌గ‌ప‌తిబాబు ప్ర‌దాన పాత్ర పోషించిన సినిమా `ఎఫ్‌సీయూకే` (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌). ఈ సినిమా విడుద‌ల‌కుముందుగా బార‌సాల వేడుక అని ఏర్పాటు చేశారు. యూట్యూబ్‌లో ఫేమ‌స్ అయిన‌వారితో చిత్రంలోని పాట‌ల‌ను విడుద‌ల చేయించారు.  "ముఝ్ సే ఏక్ సెల్ఫీ లేలో" సాంగ్‌ను బ‌బ్లూ, "నేనేం చెయ్య.." పాట‌ను దుర్గారావు దంప‌తులు, "మ‌న మ‌న‌సు క‌థ" పాట‌ను దేత్త‌డి హారిక‌, "హే హుడియా ప్రేమ‌లో ప‌డిపోయా" సాంగ్‌ను దిల్ సే మెహ‌బూబ్, "గారాల‌ప‌ట్టి నా గుండెత‌ట్టి" పాట‌ను ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ రిలీజ్ చేశారు. జ‌గ‌ప‌తిబాబుకు చిన్న‌ప్ప‌ట్నుంచీ తాను ఫ్యాన్‌న‌నీ, ఆయ‌న‌తో క‌లిసి ఓ స్టెప్ వెయ్యాల‌నేది త‌న కోరిక అనీ దుర్గారావు చెప్ప‌గా, జ‌గ‌ప‌తిబాబు స్టేజి మీద‌కు వ‌చ్చి `నేనేం చెయ్య` పాట‌కు దుర్గారావుతో క‌లిసి స్టెప్పులేశారు. దేత్త‌డి హారిక‌తో క‌లిసి భ‌ర‌త్‌, సునీల్ డాన్స్ చేశారు. ఇలా సంద‌డిగా చిత్ర యూనిట్ పాల్గొంది.

శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని హోట‌ల్ ద‌స్‌ప‌ల్లాలో ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) బార‌సాల (ప్రి రిలీజ్‌) వేడుక సంద‌డి సంద‌డిగా, క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ఇదివ‌ర‌కు ఈ చిత్రంలోని ఆడియో సాంగ్స్‌ను కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ చేతుల మీదుగా విడుద‌ల చేయ‌గా, ఈ బార‌సాల వేడుక‌లో వాటి వీడియో సాంగ్స్‌ను పాపుల‌ర్ యూట్యూబ‌ర్స్‌తో రిలీజ్ చేయించ‌డం గ‌మ‌నార్హం.