సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (11:51 IST)

ఏసుక్రీస్తుగా జగ్గూభాయ్ : ఫోటో వైరల్

హీరో నుంచి విలన్‌గా మారిన నటుడు జగపతిబాబు. తండ్రిపాత్రలతో పాటు విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ ఆయ‌న వ‌రుస‌గా సినిమాల్లో నటిస్తున్నారు. ఫలితంగా ఇటీవలి కాలంలో విలన్‌ పాత్రల్లో అద్భుతంగా రాణిస్తూ బిజీ నటుడుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సిలువలో ఉన్న ఏసు క్రీస్తులా సినీన‌టుడు జ‌గ‌ప‌తి బాబు పోస్ట్ చేసిన ఫొటోను చూసి అభిమానులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
త‌ల‌కు ముళ్ల‌ కిరీటం, మేకు‌ల‌తో సిలువ‌కు కొట్టిన చేతులు, ర‌క్తం కారుతోన్న ముఖంతో జ‌గ‌ప‌తి బాబు ఇందులో క‌న‌ప‌డుతున్నాడు. అయితే, ఈ స్టిల్ సినిమా కోసం దిగారా? అన్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించలేదు. దీంతో ఈ ఫొటోపై అభిమానులు ఆయ‌న‌ను ప్ర‌శ్నిస్తున్నారు.
 
ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తి బాబు.. విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కత్వంలో "ఫాదర్ - చిట్టి - ఉమా - కార్తిక్" అనే సినిమాలో న‌టిస్తున్నాడు. వ‌చ్చేనెల‌ 12న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో జ‌గ‌ప‌తి బాబు తండ్రిగా క‌నిపించ‌నున్నాడు. ఇవేకాక ప‌లు సినిమాలు ఆయ‌న చేతిలో ఉన్నాయి.