ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (14:41 IST)

ప్రముఖ నటి భర్త జైలుపాలు.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడి పొడిగింపు

రాజ్ కుంద్రా...ఈ పేరు వినగానే మనందరికీ శిల్పా శెట్టి భర్తగా మాత్రమే తెలుసు. రీసెంట్‌గా పోర్న్ రాకెట్ గుట్టు రట్టువడంతో అతని అశ్లీల చిత్రాల కంపెనీ వ్యవహారం బయటపడింది. పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. ఇప్పటికే ఈ కేసులో పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు బాంబే హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు Anticipatory Bail మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 
 
గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిపతిగా ఉన్నారు. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో అతడి ప్రతిష్ట మసకబారింది. వెస్ట్ ముంబైలోని ఒక బిల్డింగ్ లో నీలి చిత్రాలు తీసే ఒక ముఠాను ముంబయి ప్రాపర్టీ సెల్ పోలీసులు అరెస్టు చేయగా ఆ ప్రొడక్షన్ హౌస్ మూలాలు యూకే కంపెనీవి అని గుర్తించారు. దానికి హెడ్ పేరు ఉమేశ్ కామత్ అని ఉంది. అతడు రాజ్ కుంద్రా బినామీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అలా తీగ లాగితే డొంక అంతా కదిలింది. 
 
ఈ నేపథ్యంలో పోర్న్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడిని పొడిగిస్తూ కిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 19న రాజ్ కుంద్రాతో 11 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గెహనా వశిష్ఠ్‌కు పోలీసులు సమన్లు పంపించారు. ఈ కేసులో భాగంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టిని పలు కోణాల్లో విచారించారు. 
 
ఈ సందర్భంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. రాజ్ కుంద్రా కు బిగ్ షాక్ ఇచ్చారు. కాన్పూర్‌ ఎస్‌బీఐలో ఉండే ఆయన రెండు అకౌంట్‌లను సీజ్ చేశారు. ఈ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు ముంబై పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు యాప్ షాట్ నుంచి పలు సమాచారాన్ని రాబట్టారు. అంతేకాదు కొన్ని పోర్న్ వీడియోల డాటాను స్వాధీనం చేసుకున్నారు.