ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (23:57 IST)

ఐఎండీబీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్‌ లిస్టులో శోభిత-సమంత

Sobhita-Samantha
ఐఎండీబీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్‌ లిస్టులో శోభిత-సమంతలకు చోటు లభించింది. IMDb సినిమాలు, టీవీ, ప్రముఖుల సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి నేడు 2024 టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. 2024లో నెం.1 ఇండియన్ స్టార్ అయిన త్రిప్తి డిమ్రి ఈ ఏడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భులైయా 3 అనే మూడు సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
 
“ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2024 జాబితా భారతీయ వినోదరంగంలోని విభిన్నతను ప్రదర్శిస్తుంది. ఇందులో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న నటులతో పాటు కొత్తగా వస్తున్న నటులను కలుపుకుని ఉంది" అని ఐఎండిబి ఇండియా హెడ్ యామిని పటోడియా అన్నారు. “మా ఈ వార్షిక జాబితా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అభివృద్ధి చెందుతున్న ఆసక్తులను ప్రతిబింబిస్తుంది. షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి లెజెండరీ తారలు త్రిప్తి దిమ్రీ మరియు షార్వరి వంటి వర్ధమాన ప్రతిభావంతులతో పాటు అభిమానులను ఎలా ఆకర్షిస్తున్నారో హైలైట్ చేస్తుంది. ఈ ఏడాది జాబితా భారతీయ సినిమా రంగంలోని నటులు వారి  విస్తరిస్తున్న అంతర్జాతీయ ఆకర్షణను కూడా తెలియజేస్తుంది”
 
IMDB 2024 Most Popular Indian Stars
తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన తృప్తి డిమ్రీ, "ఐఎండిబి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2024 జాబితాలో నెం.1 స్థానం పొందడం నిజంగా గొప్ప గౌరవం. ఈ గుర్తింపు నా అభిమానుల నమ్మశక్యం కాని మద్దతుకు మరియు నాకు సహకరించిన ప్రతి ఒక్కరి కృషికి ఇది నిదర్శనం. అద్భుతమైన ప్రాజెక్టులలో పనిచేయడం నుండి 2024 భూల్ భులైయా 3తో ముగించడం వరకు, ఇది నాకు చిరస్మరణీయమైన సంవత్సరం. నేను ఈ స్ఫూర్తిదాయక పరిశ్రమలో భాగం అవుతూనే భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్నాను”
 
2024 సంవత్సరానికి గాను టాప్ 10-మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్
 
1. త్రిప్తి డిమ్రీ
2. దీపికా పదుకొణె
3. ఇషాన్ ఖట్టర్
4. షారుఖ్ ఖాన్
5. శోభిత ధూళిపాళ
6. శార్వరి
7. ఐశ్వర్య రాయ్ బచ్చన్
8. సమంత
9. అలియా భట్
10. ప్రభాస్  
 
ఐఎండీబీ టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2024 జాబితాలో 2024లో ఐఎండీబీ వీక్లీ ర్యాంకింగ్స్ లో నిలకడగా అగ్రస్థానంలో నిలిచిన తారలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇవ్వబడ్డాయి.
 
ఈ సంవత్సరం మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ గురించి కొంత అదనపు సమాచారం:
దీపికా పదుకొణె (నెం.2) ఈ ఏడాది మూడు ప్రధాన చిత్రాలు విడుదలయ్యాయి: ఫైటర్, కల్కి 2898 A.D, సింగం ఎగైన్. కల్కి.2898 A.D సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన కెరీర్ లో మరో మైలురాయిని అందుకుంది.
ఇషాన్ ఖట్టర్ (నెం.3) తన రెండవ అంతర్జాతీయ టీవీ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్ పాత్రతో తన అభిమానులకు దగ్గరయ్యాడు, దీనిలో నికోల్ కిడ్ మన్, లీవ్ ష్రైబర్ మరియు ఈవ్ హ్యూసన్ లతో కలిసి నటించాడు.
శోభితా ధూళిపాళ (నెం.5) ఈ ఏడాది మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 A.D, కోసం తెలుగులో దీపికా పదుకొణెకు డబ్బింగ్ చెప్పింది. అంతేకాకుండా ఈ ఏడాది తెలుగు హీరో నాగచైతన్య అక్కినేనితో ఆమె వివాహం జరిగింది.
శర్వరి (నెం.6) మూడు సినిమాలలో మంచి విజయాన్ని అందుకుంది: ముంజ్యా, మహారాజ్, మరియు వేద. ఆమె ఆగస్టులో ఐఎండిబి "బ్రేక్అవుట్ స్టార్" స్టార్ మీటర్ అవార్డును అందుకుంది.
అలియా భట్ (నెం.9) ఫ్యాన్ ఫేవరెట్ గా తన పరంపరను కొనసాగిస్తోంది.  ఈ జాబితాలో వరుసగా మూడోసారి కనిపించింది. 2024 లో పారిస్ ఫ్యాషన్ వీక్లో అరంగేట్రం చేసిన ఆమె ఈ సంవత్సరం జిగ్రా అనే థియేట్రికల్ ప్రొడ్యూస్ కూడా చేసింది.