శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (17:30 IST)

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

samanta - joseph
హీరోయిన్ సమంత ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. మనం మళ్లీ కలిసే వరకు, నాన్న అంటూ హార్ట్ ఎమోజిని కలిగి ఉంది. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. కాగా, తండ్రి మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, తన తండ్రితో ఉన్న అనుబంధం, చిన్నతనం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'నువ్వు నా జీవితంలో నిత్యం నాతో ఉన్నావు. నువ్వు చూపించిన ప్రేమ, నీతి మర్చిపోలేనిది' అంటూ సమంత తన ఎమోషనల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
ఇటీవలికాలంలో సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత, ఆమె వైద్య సమస్యలతో పాటు తన కెరీర్ పునర్నిర్మాణంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు తండ్రిమృతి వంటి శోకకరమైన సంఘటనను ఎదుర్కోవడం ఆమెకు తీరని లోటుగా చెప్పుకోవచ్చు.