శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 5 నవంబరు 2016 (13:46 IST)

ఆయనకంత సీన్ లేదు.. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు : శ్రద్ధా కపూర్

బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్‌కు తనకు మధ్య ఎఫైర్ ఉన్నట్టు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సాగుతున్న దుష్ప్రచారంపై హీరోయిన్ శ్రద్ధా కపూర్ స్పందించారు. పైగా ఈ అంశంపై మీడియా కూడా బాగా ప్రచారం

బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్‌కు తనకు మధ్య ఎఫైర్ ఉన్నట్టు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సాగుతున్న దుష్ప్రచారంపై హీరోయిన్ శ్రద్ధా కపూర్ స్పందించారు. పైగా ఈ అంశంపై మీడియా కూడా బాగా ప్రచారం చేసింది కూడా. దీంతో ఆమె నోరు విప్పక తప్పలేదు.
 
దీనిపై శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ ఫర్హాన్ అఖ్తర్ మధ్య తనకు ఎఫైర్ కొనసాగుతోందని బీటౌన్‌లో ప్రచారం బాగానే జరుగుతోంది. మీడియా కూడా ఈ అంశంపై బాగా ఫోకస్ చేసింది. నిజానికి తనకు ఫర్హాన్‌కు మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావటం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 
 
తమకూ కుటుంబాలు ఉంటాయని... ఇలాంటి వార్తలతో కుటుంబసభ్యులు కంగారు పడటమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కూడా వస్తాయని చెప్పుకొచ్చింది. పైగా, తనకు సోలోగా ఉండటమే ఇష్టమని... అలాంటప్పుడు ఫర్హాన్‌తో ఎందుకు ప్రేమలో పడతానని ప్రశ్నించింది.