శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (11:15 IST)

హీరోలకు అద్దం చూసేందుకే టైంలేదు.. ఇక డేటింగ్ ఏం చేస్తాను : శ్రియ

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో డేటింగ్ చేశారా? అనే అంశంపై నటి శ్రియ స్పందించారు. డేటింగ్‌‌కి వెళ్లాలంటే ఎదుటివ్యక్తిపైన ప్రేమ ఉండాలన్నారు. నిజంగా ప్రేమలో పడ్డవారు ఒక్క మాటైనా మాట్లాడుకోకపోయినా

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో డేటింగ్ చేశారా? అనే అంశంపై నటి శ్రియ స్పందించారు. డేటింగ్‌‌కి వెళ్లాలంటే ఎదుటివ్యక్తిపైన ప్రేమ ఉండాలన్నారు. నిజంగా ప్రేమలో పడ్డవారు ఒక్క మాటైనా మాట్లాడుకోకపోయినా రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ గడిపేయగలరని చెప్పింది. 
 
'ఇక హీరోలతో నా డేటింగ్ విషయానికి వస్తే... హీరోలకు రోజులో సగం సమయం అద్దం ముందు చూసుకోవడానికే సరిపోతుంది. మిగిలిన సగం సమయంలో నేను అద్దం చూసుకుంటూ గడిపేస్తాను. ఇక మా మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? డేటింగ్‌కి ఎవరితో వెళ్లాలి?' అని శ్రియ ప్రశ్నించింది.
 
అయినా ప్రేమించడం అంత తేలిక కాదన్నారు. ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన విషయం ప్రేమలో పడటం అని, కానీ అందరూ అత్యంత సులువుగా ‘లవ్‌’ అనే పదాన్ని వాడేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని శ్రియ చెప్పుకొచ్చింది.