సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (21:50 IST)

ఓ మైగాడ్, శ్రియా శరణ్ జస్ట్ మిస్...

Shriya Saran
దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రియా చరణ్ భర్తతో ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఇటలీలో ఇరుక్కుపోయిన సుందరి.. ప్రస్తుతం తన భర్త అండ్రీ కొశ్చేవ్‌తో కలిసి పెరూ నగరంలో విహరిస్తున్నారు. కుజ్కో రీజియన్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన మాచు పిక్కు అనే జంతు ప్రదర్శన శాలకు వెళ్లారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఏడు వింతల్లోనే ఒకటిగా 2007 ఓట్లింగ్ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన చిన్న సంఘటనను పంచుకొన్నారు. 
 
మాచూ పిక్కు ప్రాంతంలోని అరుదైన జంతువుల మధ్య గడుపుతూ భర్తతో ఆ సమయాన్ని మధురంగా మార్చుకొన్నారు. జంతు ప్రదర్శన శాలలో ఉండే దక్షిణాఫ్రికాకు చెందిన లామా అనే జంతువుతో మురిపెం చేయబోయారు. 
 
శ్రియా దాని ముందు ఉండగానే ఒక్కసారిగా ఒంటె జంప్ చేసి పరుగులు పెట్టింది. సౌతాఫ్రికా‌కు చెందిన లామా ఉన్నట్టుండి పరుగులు పెట్టడంతో శ్రియా చరణ్ దీనిని గమనించి అప్రమత్తమైన శ్రియ లేచి దూరం వెళ్లడంతో ఒంటె దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ వీడియోను "టేక్‌ మీ బ్యాక్‌" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఒక్కసారిగా భయపడి పోయారు. వెంటనే ఆ షాక్ నుంచి తేరుకొని నేను భయపడి పోయాను అంటూ భర్తకు చెబుతూ వీడియోలో కనిపించింది. కాగా 2018లో శ్రియ రష్యాకు చెందిన అండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ వేడుకకు ఉదయ్‌పూర్‌ వేదికగా మారింది. ఆండ్రీ బార్సిలోనాలో స్థిరపడిన మాజీ టెన్నిస్ ఆటగాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్‌ చిత్రంలో నటిస్తున్నారు.