మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (13:57 IST)

పుస్తకం చదవలేక పోవచ్చు.. అంటే ఆ పుస్తకం బాగోలేదని కాదు... శ్వేతాబసు విడాకులు (video)

టాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ భాషల్లో నటించిన నటి శ్వేతాబసు. తెలుగులో కొత్త బంగారులోకం చిత్రంతో మంచి పేరుదక్కించుకుంది. ఈమె వ్యభిచారం కేసులో చిక్కుకుని టాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత ఆమెకు ఒకటి, అర సినీ అవకాశాలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత సినిమాల్లో నిలదొక్కుకోలేక పోయింది. 
 
ఈ క్రమంలోనే సినీ రంగానికి చెందిన రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం కూడా ఒక యేడాది క్రితం జరిగింది. అయితే, వీరిద్దరి పెళ్లి సంవత్సరం తిరగకుండానే పెళ్లి పెటాకులు కానుంది. 
 
ఇదే అంశంపై శ్వేతా బసు స్పందిస్తూ, తమ వివాహబంధానికి ముగింపు పలకాలని తాను, రోహిత్ పరస్పరం అంగీకారానికి వచ్చామని తెలిపింది. లోతుగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఇరువురి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయానికి వచ్చామని పేర్కొంది. 
 
ముఖ్యంగా, ప్రతి పుస్తకాన్ని మనం పూర్తిగా చదవలేక పోవచ్చని... దీని అర్థం ఆ పుస్తకం బాగోలేదని కాదని చెప్పింది. తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినందుకు, తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు రోహిత్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపింది. రోహిత్ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని ఆకాంక్షించింది.