బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 మే 2024 (12:09 IST)

కమల్ హాసన్ థగ్ లైఫ్ లో సిలంబరసన్ టిఆర్ (శింబు) ఎంట్రీ ఇచ్చాడు

SilambarasanTR,
SilambarasanTR,
ఉలగనాయగన్  కమల్ హాసన్  ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలో శింబు ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటిస్తూ,  న్యూ థగ్ఇన్ టౌన్  సిలంబరసన్ టిఆర్ అంటూ వెల్లడించింది. యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన ఇంట్రో వీడియోతో  కారులో స్పీడ్ గా వస్తూ తుపాకి గురిపెట్టే షాట్ తో శింబు ఎంట్రీ ఇచ్చాడు.
 
త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను  మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కమల్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా. కొంతకాలంగా ఈ సినిమాలో శింబు వున్నాడంటూ వార్తలు వచ్చాయి. దానికి నేడు అధికారికంగా ప్రకటించడం విశేషం.
 
కాగా,  జయంరవి, దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా,  ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.  రాజ్ కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ బేనర్ లో రూపొందుతోంది.